గ్రేట‌ర్‌లో 99% రికవరీ రేటు..! ఊపిరిపీల్చుకుంటున్న అధికారులు

-

గ్రేటర్ హైద‌రాబాద్‌‌లో కరోనా కేసుల రికవరీ రేటు పెరిగింది. ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కో లుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుం టున్నారు. వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా అదేస్థాయిలో రికవరీ రేటు పెరుగుతున్నది.
కరోనా గుప్పిట నుంచి గ్రేటర్‌ విముక్తి పొందుతుండ‌టంతో ప్రతి ఒక్కరిలో మానసికస్థైర్యం రెట్టింపు అవుతున్నది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,33,807 మంది క‌రోనా బారిన పడగా వారిలో ఈ నెల 8 వరకు 1,22,905 మంది పూర్తిగా కోలుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గ్రేట‌ర్‌లో దాదాపు 90 శాతం రికవరీ రేటు ఉన్నద‌ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా 10,902 కరోనా పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్‌ జిల్లాలో ఈ నెల 9 వరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 75,886 కాగా ఇప్పటివరకు 70,119 మంది కోలుకున్నారు. 5419 మంది చికిత్స పొందుతున్నారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 39,042 మంది బాధితులు వైరస్‌కు గురికాగా 35,960 మంది కోలుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం కేసులు 46,221 కాగా గ్రేటర్‌ పరిధిలో 28104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,418 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 2628 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news