జగన్ సంచలనం… ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జ్ మీద తీవ్ర ఆరోపణలు

-

ఇన్ని రోజులు తమ ప్రభుత్వానికి కోర్టులు అడ్డు పడుతున్నాయని ఆరోపిస్తున్న అధికార పార్టీ, అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ లేఖ వ్రాశారు. ఆ లేఖతో అమరావతి స్కాంకి సంబంధించి ప్రభుత్వ విచారణ, పోలీస్ కేసులు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సీఎం కార్యాలయం జత పరిచింది. అమరావతి రాజధాని భూ కుంభకోణంలో హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు స్టే విదించడాన్ని ఛాలెంజ్ చేసి సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించామని, అయితే ఆంధ ప్రదేశ్ లో జరుగుతున్న హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్ వి రమణ జోక్యం చేసుకుంటున్నాడని జగన్ ఆరోపించారు.

ఇక లేఖ గురించి ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అజేయ కళ్లాం మాట్లాడుతూ దీనికి సంబంధించి వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచామని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ చంద్రబాబు అత్యంత సన్నిహితుడని ఆయన అన్నారు. చంద్ర బాబు, వాళ్ళ పార్టీ నేతలకు అనుకూలంగా ఎన్ వి రమణ వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఎన్ వి రమణ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ కి అనుకూలంగా ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. హై కోర్టులో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిందన్న ఆయన ఎన్ వి రమణ హైకోర్టు న్యాయమూర్తుల మీద ప్రభావం చూపుతున్న కారణం చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి పిర్యాదు చేసామని అన్నారు. అమరావతిలో భూ కుంభకోణంలో జరిగిన అక్రమాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news