వెదర్ అప్డేట్ : తెలుగు రాష్ట్రాలకి మరో రెండు రోజులూ వర్షాలే..

-

తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం నిన్న ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. దాని ప్రభావంతో 24 గంటలలో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండముగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబరు 12 వ తేదీ ఉదయం/ మధ్యాహ్నం వాయుగుండముగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా , రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

రేపు ఉత్తర కోస్తా దక్షిణ వరుస మధ్య , వాయుగుండంగా తీరం దాటే అవకాశం. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. అలానే రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news