115 ఏళ్ల నాటి బైక్‌ వేలం.. రూ.7.72 కోట్లు పలికిన ధర

-

ఆంటిక్ పీస్.. అదేనండి పురాతన కాలం వస్తువులకు ఉండే క్రేజే వేరు. క్రేజే కాదు వాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేటి కాలం వాళ్లకు పురాతన వస్తువులంటే కాస్తే మక్కువ ఎక్కువే. అందుకే వాటిని చూసేందుకు మ్యూజియంకు వెళ్తుంటారు. కొందరైతే ఆ వస్తువులను వేలం వేసినప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అలా వేలంలో ఓ పాతకాలపు మోటర్ బైక్ ఏకంగా కోట్ల ధర పలికింది. దీని కథేంటో తెలుసుకుందామా..?

పాతకాలపు ఓ మోటారు బైక్‌ తాజా వేలంలో ఎంత ధర పలికిందో తెలుసా. అక్షరాలా రూ.7.72కోట్లు(9,35,000 అమెరికా డాలర్లు). అదే స్ట్రాప్‌ ట్యాంక్‌ హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌. పాతకాలం మోటారు బైక్‌లు అమ్మే వింటజంట్‌ వెబ్‌సైట్‌ గతనెలలో దీన్ని వేలానికి పెట్టింది. 1908లో తయారయిన ఈ బైక్‌.. ఆయిల్‌, ఇంధన ట్యాంకును నికెల్‌తో చేసిన పట్టీలతో జతచేస్తుంది. అందుకే దీనికి స్ట్రాప్‌ ట్యాంక్‌ హార్లీ డేవిడ్‌సన్‌ అనే పేరు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news