2 అంగుళాల తోకతో పుట్టిన శిశువు.. వైద్యులకే షాకిచ్చిందట..!!

-

జనరల్‌గా మనం ఏదైనా కష్టమైన పని చేసినప్పుడు సరదగా.. తల ప్రాణం తోకకు వచ్చింది అంటాం.. మనుషులకు తోక ఉండదు. జంతువులకు మాత్రమే ఉంటుంది కదా.. కానీ తాజాగా మెక్సికోలో ఓ పాప 2 అంగుళాల పొడవున్న తోకతో పుట్టింది. మనుషులకు తోక ఉండటం ఏంటా అనుకుంటున్నారా..? ఆ పాపను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.. పాప తోక ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పసికందు పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
న్యూవో లియోన్లోని ఆసుపత్రిలో ఓ మహిళ..ఆడపిల్లకు జన్మనిచ్చింది. శిశువు పూర్తి కాలం గర్భంలో ఉన్నాకే జన్మించింది. గర్భధారణ సమయంలో ఎటువంటి సమస్యలు లేవు. అయితే పుట్టిన శిశువుకు రెండు అంగుళాల (5.7 సెంటీమీటర్లు) తోక ఉంది. అది చూసి మెక్సికన్ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి కేసు మెక్సికోలో ఎప్పుడూ నమోదు కాలేదని డాక్టర్లు తెలిపారరు. పాప, పాప తల్లి కూడా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు.
 “శిశువు తోక మృదువుగా.. చక్కటి వెంట్రుకలతో నిండి ఉంది. ఎటువంటి నొప్పి లేకుండా అది కదులుతుంది. కానీ సూదితో చిన్నగా పొడిచినప్పుడు పాప ఏడ్చింది.” అని డాక్టర్లు తెలిపారు. పాపకు రెండు నెలల వయస్సు వచ్చిన తర్వాత చిన్న ఆపరేషన్‌తో తోక తొలగించబడిందని. బాలిక అదే రోజు డిశ్చార్జ్ చేశారు. ఎటువంటి సమస్యలు లేవని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల్లో తోక ఏర్పడుతుందని, కానీ తొమ్మిది నెలల తర్వాత అది ఎముకగా మారి లోపలికి వెళ్లిపోతుందని కొన్ని అరుదైన కేసుల్లో మాత్రం తోకతో పుడతారని వైద్య నిపుణులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలాంటి కేసులు కేవలం 195 గుర్తించబడ్డాయట. పొడవైనది 20 సెంటీమీటర్లు (7.9 అంగుళాలు) ఉన్న తోకను గుర్తించారు. ఇవి చాలా తరచుగా అబ్బాయిలలోనే కనిపిస్తాయట. కానీ, మెక్సికోలో ఇలా ఓ ఆడ శిశువు తోకతో జన్మించడం కూడా చాలా అరుదని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇటీవల నేపాల్‌లో దేశాంత్ అధికారి (16) అనే కుర్రవాడికి ఏకంగా 70 సెంటీ మీటర్ల పొడవున్న తోక ఉంది. దేశాంత్ పుట్టిన కొన్ని రోజులకే తల్లిదండ్రులు తోకను గుర్తించారు. దానికోసం చాలా ఆస్పత్రులకు తిరిగారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తర్వాత దేశాంత్ హనుమంతుడి పునర్జన్మ అని ఓ పూజారి చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందించి.. తోకను అలాగే వదిలేశారు. కానీ ఆ తోక వల్ల దేశాంత్ అధికారి చాలా ఇబ్బందులు పడ్డాడంట.

Read more RELATED
Recommended to you

Latest news