ప్రస్తుత కాలంలో ప్రేమ వ్యవహరాలు బాగానే పెరిగిపోయాయి. అయితే.. ఈ ప్రేమ వ్యవహరం కారణంగా చాలా సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా బ్రేకప్ చెప్పిందని.. ఓ యువతి పర్సనల్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు ఓ ప్రభుద్ధుడు. దీంతో ఆ యువతి పరువు మొత్తం పోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… విజయవాడలోని ఓ ప్రముఖ కాలేజీలో ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు అదే కాలేజీలో చదువుతున్న రోహిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు.
తొలుత స్నేహం పేరుతో యువతికి దగ్గరైన రోహిత్… ఆ తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పటికే అతడి స్నేహానికి ఆకర్షితురాలైన యువతి.. ప్రేమకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆమెకు మాయమాటలు చెప్పడంతో తన నగ్న వీడియోలు, ఫోటోలను రోహిత్‌కు పంపింది. ఐతే ఇటీవల ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో యువతి… రోహిత్ కు బ్రేకప్ చెప్పింది. దీంతో రోహిత్ కుమార్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత యువతి తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఆ నిందితున్ని అరెస్ట్ చేశారు.