అన్నం తినకుండా బ్రతకడం సాధ్యమవుతుందా…? అసలు అది అయ్యే పని కాదు. ఏదోక ఆహారం కచ్చితంగా మనం తినాలి. ఆహారం లేనిదే ఒక మనిషి బ్రతకడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అయినా సరే ఆహారం తినాలి. అయితే పదేళ్ల బాలుడు మాత్రం పుట్టినప్పటి నుంచి అన్నం తినకుండా కేవలం కురుకురేలు, లేసులు తింటున్నాడు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన అనంతవరపు యాకోబు, ఏసమ్మ దంపతుల పెద్ద కుమారుడు చా ర్లెస్. అతను ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు. పుట్టిన రోజు నుంచి నేటి వరకు కూడా మెతుకు అన్నం కూడా తినలేదు. కేవలం ప్యాకెట్లు, బిస్కెట్లు తినడం మంచి నీరు తాగడం వంటివి చేస్తున్నాడు. అన్నం పెట్టాలి అని చూసినా తినడం లేదు.
అసలు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఎవరికి అర్ధం కాలేదు. దీనితో అతనికి ఏదో ఉంది అనారోగ్య సమస్య అని భావితున్నాడు. అతనికి అన్నం పెట్టాలి అని చూసినా సరే తినే ప్రయత్నం కూడా చేయడు. దీనితో పిల్లాడికి ఏదో వ్యాధి ఉందని ప్రభుత్వం అతని మీద దృష్టి పెట్టి ఏదోక విధంగా ఉచిత వైద్యం అందించాలి పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం సహాయం చెయ్యాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.