రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటక బళ్లారిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీరేశ్(40), అతడి భార్య అంజలి(35), కుమారుడు దినేశ్(6) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరేశ్ కుమార్తె హనీ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంతో మూడేళ్ల చిన్నారి అనాథ అయింది.
మొరార్జీ దేశాయ్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు వీరేశ్. బుధవారం యరగుడి ప్రాంతం నుంచి బళ్లారిలోని గఫూర్ టవర్ వద్ద ఉన్న తన ఇంటికి వెళ్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. వీరేశ్ బైక్‌ను.. వెనక నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది.
దీంతో వీరేశ్, అతడి భార్య, కుమారుడు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ చిన్నారి హనీని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని బళ్లారి ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. టిప్పర్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.