పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తకోట గ్రామంలో పందెం కోళ్ల పెంపక కేంద్రానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనలో మొత్తం 80 కోళ్లు పందెం కోళ్లు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ఆస్తి నష్టం రూ. 5 లక్షల వరకు ఉండవచ్చని కేంద్రం నిర్వాహకులు కౌరు గోకన్న వాపోయాడు.
కావాలనే గిట్టని వాళ్లు ఎవరో గోకన్న పందెం కోళ్ల ఫాంకు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కౌరు గోకన్న వేడుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.