కొడంగల్ లో కలెక్టర్ మీద దాడి చేసింది BRS కార్యకర్త అని ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమృత్ టెండర్లు అర్హత లేని వాళ్లకు ఇచ్చింది కేటీఆర్ అని…. వాటిని రద్దు చేయాలని చెప్పిందే నేను అని తెలిపారు. మేము టెండర్ పిలవడం వల్ల 65 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయని తెలిపారు. కేటీఆర్..నీ ఢిల్లీలో ఎవరు డెకరు అంటూ చురకలు అంటించారు. కేటీఆర్… డిల్లీకి వెళ్ళింది గవర్నర్ విచారణ నుంచి బయట పడేందుకు అంటూ చురకలు అంటించారు.
ఈ-రేసింగ్ లో.. కంపెనీకి ఫండ్స్ లోకి మార్చి నిధులు మళ్లించారని.. అది చాలా పెద్ద నేరం అన్నారు. దాంట్లో ఎక్కడ జైలుకు వెళ్తానో అనే భయం పట్టుకుందని కేటీఆర్ కు చురకలు అంటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమృత్ స్కీమ్ లో ఆయన.. ఇచ్చిన కంపెనీ ఎవరిది..? అన్నారు. ప్రతిమా.. గజా కంపెనీలు కేసీఆర్ సన్నిహితులవే కదా అంటూ చురకలు అంటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్.. తన అవినీతి బయటకు వచ్చింది..జైలుకు పోవాల్సి వస్తుందని… ఇష్యూ డైవర్ట్ చేస్తున్నాడన్నారు. కొడంగల్ లో కలెక్టర్ మీద దాడి చేసింది BRS కార్యకర్త అని…. కలెక్టర్ మీద దాడి చేయించి ఇష్యూ డైవర్ట్ చేసే పనిలో ఉన్నారని ఆగ్రహించారు.