తెలంగాణలో మరో దారుణం.. భర్తకు మద్యం తాగించి భార్యపై గ్యాంగ్ రేప్!

తెలంగాణ రాష్ట్రం లో మరో దారుణం చోటు చేసుకుంది. రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తారామతి పేట లో ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌ ఘటన కలకలం రేపింది. భర్తకు మద్యం తాగించి.. ఆ మహిళను గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుర్మార్గులు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…అబ్దుల్లాపూర్ మండలం తారామతి పేట కు చెందిన భార్య, భర్తలకు పీకల దాకా మద్యం తాగించారు కొందరు దుర్మార్గులు.

ఈ దుర్మార్గులు… ఆ భర్త మిత్రులు కావడం గమనార్హంం. భర్త మత్తులో ఉండగా అతని భార్య పై అత్యాచారం చేసి… చంపారు ఆ ఫ్రెండ్స్. సృహ లోకి వచ్చాక చనిపోయిన భార్య ను చూసి బోరున విలపించాడు భర్త. భార్య వంటి పై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా గుర్తులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ భార్త. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఒకరైన సురేష్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.