సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చీఫ్ ని ఎన్నుకునే క్రమంలో కీలక అడుగు పడినట్టు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సాయంత్రం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేసిన సూచనల ప్రకారం కేంద్రం అడుగు వేయనుంది. సిబిఐ చీఫ్ గా కనీసం 6 నెలల పదవీ కాలం ఉన్న వారిని నియమించాలని గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు.
మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుబోధ్ కుమార్ జైస్వాల్… శాస్త్రా సీమా బాల్ డైరెక్టర్ (ఎస్ఎస్బి ) కె.ఆర్.చంద్ర, హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.ఎస్.కె కౌముది పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. వీరి అందరి కంటే సుబోద్ కుమార్ జైస్వాల్ ముందు వరుసలో ఉన్నారు.