హరీష్‌రావు బంధువులపై చీటింగ్‌ కేసు..అదంతా ఫేక్‌ అంటూ పోలీసుల ప్రకటన !

-

హరీష్‌రావు బంధువులపై చీటింగ్‌ కేసుపై పోలీసులు ప్రకటన చేశారు. హరీష్ రావుకు గానీ.. వాళ్ల బంధువులకు గానీ ఈ కేసులో సంబంధం లేదని… ఇంటి పేరు మాత్రమే తన్నీరు అంటూ పోలీసులు వెల్లడించారు. తాజాగా మాజీ మంత్రి హరీష్‌ రావు బంధువులపై కేసు నమోదు అయిందని వార్తలు వచ్చాయి. మియాపూర్‌లో ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు అయిందని వార్తలు వచ్చాయి.

దండు లచ్చిరాజు ఐదంతస్థుల ప్రాపర్టీలోకి.. అక్రమంగా వచ్చి ఉంటున్నాట మాజీ మంత్రి బంధువులు అంటూ ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై పోలీసులు ప్రకటన చేశారు. ఇది రెండు ప్లాట్ల విషయంలో వివాదం అన్నారు. రెండు ప్లాట్ల మధ్య వివాదంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారట బాధితులు. హరీష్ రావు పేరు లేదని, ఈ కేసుకి హరీష్ రావుకి సంబంధం లేదని చెబుతున్నారు పోలీసులు. ఈ కేసులో ఉన్న వారి ఇంటి పేరు తన్నీరు కావడంవల్ల ప్రచారం చేస్తున్నారని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version