Adipurush : ప్రభాస్ పోస్టర్ ముందు చేయి కోసుకున్నాడు

-

ఇవాళ ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా విడుదల నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు థియేటర్ల వద్ద హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు శృతిమించి ప్రవర్తిస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ అభిమాని బీరు బాటిల్ పగలగొట్టి, దాంతో ప్రభాస్ పోస్టర్ ముందు పలుమార్లు చేయి కోసుకున్నాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియనప్పటికీ… ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో అభిమానం ఉండొచ్చు గానీ, మూర్ఖత్వం ఉండొద్దని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద ఆది పురుష్ మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అభిమానుల కోలాహాలం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఐమాక్స్ థియేటర్ వద్ద ఒక వ్యక్తి ఆది పురుష్ సినిమా బాగాలేదని యూట్యూబ్ ఛానళ్లతో చెప్పాడు. దీంతో అభిమానులు అతన్ని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news