అమెరికాలో బురిడీ కొట్టించి ఇండియాకు వచ్చాడు..!

-

అమెరికాలో ఉంటున్న ఓ యువకుడు వివిధ రకాల మోసాలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేసి శిక్ష అమలు చేశారు. అయితే.. అక్కడి అధికారులకు చిక్కరాదనే ఉద్దేశ్యంతో తన సోదరుడికి పేరుపై పాస్‌పోర్ట్‌ తయారు చేయించుకొని, అమెరికా పోలీసులకు చిక్కకుండా ఇండియాకొచ్చిన అతను ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మొర్రిశెట్లి రవి, నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటూ హెల్త్‌కేర్‌ ప్రాజెక్ట్‌ బిజినెస్‌ చేశారు. అందులో కొందరిని నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రవిని అరెస్ట్‌ చేసి అతని పాస్‌పోర్ట్‌ సీజ్‌ చేశారు.

సోదరుడి సాయంతో..

కోర్టులో హాజరు పరచగా రెండేళ్ల శిక్ష, రూ. 7 లక్షలకు పైగా డాలర్ల జరిమానా విధించింది. అప్పిల్‌పై బయటకు వచ్చిన రవి శిక్ష తప్పించుకొని స్వదేశానికి చెక్కేయాలని కసరత్తు ప్రారంభించాడు.కారేపల్లిలో వస్త్రా వ్యాపారం చేçస్తున్న సోదరుడు మొర్రిశెట్టి రవికిరణ్‌ పేరు, తనపేరుకు దగ్గరగా ఉండటంతో ఆ పేరుతో పాస్‌పోర్ట్‌ సంపాదించాడు. దానిని అమెరికాకు తెప్పించుకొని 2020లో ఇండియాకు వచ్చేశాడు.

రూ.1.56 లక్షల డాలర్ల అప్పు..

అమెరికాలో ఉంటున్నప్పుడే రవికి, కర్నూల్‌కు చెందిన బి. అశోక్‌తో పరిచయం ఉంది. రకరకాల కారణాలు చెప్పిన రవి, అశోక్‌ వద్ద 1.56 లక్షల డాలర్లు అప్పుడా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రవి కనబడకపోవడంతో అతను పనిచేసే చోట వచ్చి విచారించగా ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో అశోక్‌ కర్నూల్‌లో ఉంటున్న సోదరుడు క్షత్రపతికి ఈ విషయాలు తెలపడంతో గతేడాదికి జూన్‌లో క్షత్రపతి ఖమ్మం కమిషనరేట్‌ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించడంతో రవి మోసాలు బయటపడ్డాయి. దీంతో కారేపల్లి పోలీసులు గురువారం రవితో పాటు అతని సోదరుడిని అరెస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news