బండి సంజయ్ ని నిలదీసిన నిరుద్యోగి.. వీడియో వైరల్ !

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ నిరుద్యోగి. అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ? ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ? మోడీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని బండి సంజయ్ నిలదీశారు. నిన్న.. చిక్కడపల్లి లోని.. సెంట్రల్ లైబ్రరీలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుని బండి సంజయ్.. టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే.. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ యువకుడు బండి సంజయ్ ప్రసంగానికి అడ్డు తగిలారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు… మొదట మోడీ సర్కార్ ఏం చేసిందో చెప్పాలని వాగ్వాదానికి దిగాడు ఆ యువకుడు. దీంతో అక్కడి బిజేపి నాయకులు, ఆ యువకుడి మధ్య కాస్త వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎంటరై… అక్కడి నుంచి యువకున్ని తీసుకెళ్లారు. దీంతో… ఆ వాగ్వాదం సద్దుమణిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు టీఆర్ఎస్ సోషల్ మీడియాలోనూ ఇవాళ ఉదయం నుంచి.. బండి సంజయ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.