కోస్టల్ సిటీలకు పొంచి ఉన్న ముప్పు… కొనేళ్లలో మునిగిపోయే ప్రమాదం

-

పెరుగుతున్న కాలుష్యం, కర్భన్ ఉద్గాలు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏటేటా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పలు కారణంగా అయితే భారీ వర్షాలు లేకపోతే కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు, తుఫానుల కారణంగా ప్రపంచంలోని పలు నగరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువాల వద్ద మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇండియాలోని పలు తీర ప్రాంత నగరాలు మునిగిపోయే అవకాశం ఏర్పడుతుందని నాసా సంచలన విషయాలను బయటపెట్టింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజెస్( ఐపీసీసీ) అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోని సముద్రాల్లో వస్తున్న మార్పులను అంచాన వేసింది. రానున్న రోజుల్లో భారత దేశంలోని 12 తీర ప్రాంత నగరాలు నీట మునిగిపోతాయనే సంచలన విషయాను బయటపెట్టింది.

ఐపీసీసీ నివేదిక ప్రకారం వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల ఇలాగే ఉంటే..ఈ శతాబ్ధం చివరి నాటికి భారత్ లోని వాణిజ్య రాజధాని ముంబై ( మహారాష్ట్ర) 1.9 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందని అంచానా వేసింది. ఇలాగే…చెన్నై( తమిళనాడు) 1.87 అడుగులు, భావ్ నగర్( గుజరాత్) 2.7 అడుగులు, మంగళూర్ ( కర్ణాటక) 1.87 అడుగులు, పారాదీప్ ( ఒడిశా) 1.93 అడుగులు, ముర్మగోవా( గోవా) 2.06 అడుగులు, ట్యూటికోరిన్( తమిళనాడు) 1.9 అడుగులు, కిదిర్ పూర్( పశ్చిమబెంగాల్) 0.49 అడుగులు, ఓకా ( గుజరాత్) 1.96 అడుగులు, కాండ్లా( గుజరాత్) 1.87 అడుగుల మేర సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని ఐపీసీసీ హెచ్చిరించింది. ఇప్పటికైనా భూమిపై కాలుష్యాన్ని నివారించకుంటే ప్రమాదం తప్పదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news