కరోనా కాలంలో అందరం మాస్క్ పెట్టుకోని తిరిగాం.. ఎక్కడి వెళ్లినా మాస్క్ మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతున్నాయి. చైనాలో ఇప్పుడు ‘మౌత్ బడ్డీస్’ పేరుతో అపరిచితుల మూతులపై ముద్దులు పెట్టే ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు జనాలు మళ్లీ తలలు పట్టుకుంటున్నారు. ఓరినాయానా..మీకు ఏం వచ్చిందిరా..? మళ్లీ ఏం వైరస్ తెచ్చిపెడతార్రా బాబు అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ వాళ్లు ఈ ట్రెండ్‌ను ఎందుకు మొదలుపెట్టారో తెలుసా?
మాస్కులు వదిలేసి ముద్దులిస్తున్న చైనీస్..
ఈ మాయదారి ముద్దుల ట్రెండ్‌ను మాండరిన్లో ‘zui you’ (జుయి యు) అని అంటారు. అంటే.. ‘మౌత్ బడ్డీస్’ (Mouth buddies) అని అర్థమట… మౌత్ బడ్డీస్’ నియమాల ప్రకారం.. కేవలం పెదాలపైనే మాత్రమే ముద్దు పెట్టాలి. అయితే, వారితో డేటింగ్ చేయకూడదు. రెండోసారి కూడా వారికి ముద్దు పెట్టకూడదు. కేవలం ఒక్కసారి మాత్రమే పెట్టాలి…
కొత్త వ్యక్తులను మాత్రమే ముద్దాడాలి. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. అపరిచితులను ముద్దుపెట్టుకోండి అంటూ పలువురు ‘మౌత్ బడ్డీస్’ను ప్రోత్సహిస్తున్నారు. తెలియని వ్యక్తులను ముద్దు పెట్టుకుంటే అదో కిక్ అంట..ఇన్నాళ్లూ మాస్కులతో మూసివున్న నోళ్లతో అపరిచితులను పలకరిద్దాం రండి అంటూ ముద్దులు పెట్టేస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా లేకుండా ఎవరికి పడితే వారికి ముద్దులెట్టేసుకుంటున్నారు.
ఎందుకు అంటే..
అయితే, ఈ డేటింగ్ ట్రెండ్‌ను ఎవరు? ఎందుకు? ఎప్పుడు ప్రారంభించారనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రస్తుతానికి దీనిపై భిన్న వాదనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంతో ఇష్టమైనవారికి తప్పా.. తమ పేదాలను అందించరాదని, ఈ ట్రెండ్ కేవలం ఆరోగ్యానికే కాదు.. మనసుకు కూడా మంచిది కాదని అంటున్నారు.
ముద్దు అనేది ఒక మంచి ఫీల్ అని అది అపరిచితులకు ఇస్తే రాదని ఇంకొంత మంది వాదిస్తున్నారు. ఒక పక్క కరోనా వైరస్ వ్యాపిస్తుంటే.. ఇలా తెలియని వ్యక్తులను ముద్దు పెట్టుకొనే ట్రెండ్ ఏమిటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరైతే ఏకంగా వైద్య అధికారులకే నేరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ ఇంటర్నెట్ ద్వారా కరోనా కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల యువతకు కూడా చేరితే.. పరిస్థితులు ఎలా ఉంటాయనే ఆందోళన కూడా ఉంది.