ఆ ఇండస్ట్రీ అభిమానులకు మాత్రమే మంచి సినీ పరిజ్ఞానం ఉందంట.. షారుక్ ఖాన్ వైరల్ కామెంట్స్

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని సౌత్ సినిమాల్ని తక్కువ అంచనా వేసిన వీరంతా ప్రస్తుతం తెలుగు అభిమానుల్ని పొగడకుండా ఉండటం తప్పట్లేదు తాజాగా షారుక్ కూడా టాలీవుడ్ అభిమానుల కోసం ఏమన్నారంటే..

 

కొన్నాళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలంటే బాలీవుడ్ హీరోలు తక్కువగా చూసేవారు అలాగే ప్రత్యక్షంగానే కామెంట్స్ చేస్తూ ఉండేవారు అయితే ప్రస్తుతం తెలుగు సినిమా బాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయిని చేరి అంతర్జాతీయంగా క్రేజ్ సంపాదించుకుంది అలాగే హాలీవుడ్ రేంజ్ ను కూడా అందుకుంది.. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి తలకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి మరో రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకునే స్థాయికి తీసుకు వెళ్లారు రాజమౌళి.. ఈ సినిమా తర్వాత వరుసగా టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు అయితే బాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు హీరోలు సైతం ఇప్పుడు టాలీవుడ్ వైపు చూడక తప్పట్లేదు అలాగే తాజాగా షారుఖ్ ఖాన్ కూడా తెలుగు అభిమానుల్ని పొగిడేస్తున్నారు..

దాదాపు నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ తాజాగా పటాన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.. అలాగే సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నారు బాలీవుడ్ బాద్ షా.. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటీ… అంటూ ప్రశ్నించగా.. తెలుగు ఆడియన్స్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారని.. వారికి మంచి సినిమా పరిజ్ఞానం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు షారుక్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news