స్ట్రెచ్చర్‌పై పేషంట్.. సగం లోపలికి పంపగానే జారిపోయిన లిఫ్ట్..

-

వైరల్‌ వీడియోలు కావాలంటే మనం సోషల్‌ మీడియా ఫాలో అయితే చాలు.. రోజు బోలెడన్ని వీడియోస్‌ దొరుకుతాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే..మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. ఒక్కోసారి వామ్మో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందే అనుకుంటాం.. వివరాలు లేకున్నా వైరల్‌ మాత్రం అవుతాయి.. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఈ వీడియోలో ఉన్న ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు కానీ.. వీడియో చూస్తే మీరు షాక్ అవడం మాత్రం పక్కా.

ఆస్పత్రిలో రోగులను ఒక వార్డు నుంచి మరొక వార్డుకు మార్చేటప్పుడు, లేదా వార్డు నుంచి ఆపరేషన్ థియేటర్‌కి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చే ఇలా ఏదో ఒక సందర్భంగా.. లిఫ్టులు ఉపయోగించాల్సి వస్తుంది. ఈ వీడియోలో జరిగిన ఘటన కూడా అలాంటి సందర్భంలోనిదే.. ఎలివేటర్‌లో సాంకేతిక లోపం కారణంగా స్ట్రెచర్ పై పేషెంట్‌ని లిఫ్టులోకి తీసుకెళ్లిన మరుక్షణమే లిఫ్ట్ కిందపడిపోయింది. దీంతో పేషెంట్‌తో పాటు అతడి వెంట ఉన్న వారు కూడా షాకయ్యారు.

ఏం జరుగుతుందో గ్రహించే లోపే లిఫ్టు కిందకు వెళ్లిపోయింది. స్ట్రెచర్ పై ఉన్న పేషెంట్ తలకిందులుగా పడ్డాడు. అదృష్టవశాత్తు లిఫ్టుకి, అంతస్తుకు మధ్య ఎవ్వరూ చిక్కుకుపోనప్పటికీ.. ఈ దుర్ధటనలో లిఫ్టులో ఉన్న వారి పరిస్థితి ఏంటనే విషయంలోనే స్పష్టత లేదు..

ఈ ఘటన జరిగినప్పుడు లిఫ్ట్ బయట, లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను లాన్స్ అనే ట్విటర్ హ్యాండిల్ పేరిట ఒక నెటిజన్ పోస్ట్ చేశాడు.. అంతే ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న టైమ్ స్టాంప్ ప్రకారం ఈ ఘటన ఇదే ఏడాది అక్టోబర్ 8న జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వీడియోను 10.8 మిలియన్ల మంది వీక్షించారు. దీంతో ఈ పోస్ట్ మరింత వైరల్‌ అయింది. మీరు కూడా ఆ వీడియో చూడండి.. ఇలా కూడా జరుగుతుందా అని డౌట్‌ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news