హాస్పిట‌ల్‌కు వెళ్ల‌నంటున్న గ‌ర్భిణి.. దేవుడే కాపాడుతాడంటూ వింత మాట‌లు

-

అప్పుడ‌ప్పుడు కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే నిజంగానే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అస‌లు ఇలా ఎలా చేస్తారంటూ మ‌నం న‌మ్మ‌లేకుండా ఉంటాయి ఆ ఘ‌ట‌న‌లు. ఇప్ప‌టికే ఇలాంటి అరుదైన ఘ‌ట‌న‌లు మ‌న‌కు చాలానే క‌నిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. అదేంటంటే దేవుడి మీద ఉండే భ‌క్తి హ‌ద్దులు దాటితే గ‌న‌క అది చాలా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఇక ఇప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన రేఖాబాయి ఇలాంటి వింత న‌మ్మ‌కానికి తెర‌లేపింది. దీంతో అంతా ఆమె మాట‌లు విని షాక్ అవుతున్నారు.

అదేంటంటే ఆ రేఖాబాయి ఇప్ప‌డు ఎనిమిది నెలల గర్భవతి. ఇక ఈమెకు ఇప్పుడు మాత్ర‌మే కాదండోయ్ గతంలో కూడా రెండు సార్లు హైబీపీ వల్ల గర్భ స్రావం అయింది. ఇక ఇప్ప‌డు అలా జ‌ర‌గొద్ద‌ని స్థానిక ఉట్నూరు పీహెసీలో పరీక్షల కోసం ఆశా కార్యకర్త తీసుకుని టెస్టుఉ చేయించేందుకు వెళ్లారు. దీంతో అక్క‌డి వైద్యులు ఆమెను ముందు జాగ్రత్త కోసం ఆదిలాబాద్ రిమ్స్‌లో అడ్మిట్ చేయాల్సిందిగా సూచించారు.

ఇక్క‌డే అస‌లు ట్విస్టు ఏంటంటే ఆమె రిమ్స్ హాస్పిట‌ల్ కు వెళ్లేందుకు అస్స‌లు ఒప్పుకోవ‌ట్లేదు. ఎందుకంటే తాను దేవుడిని మొక్కుకున్నాన‌ని ఈ సారి త‌న‌కు ఏం కాకుండా ఆ దేవుడే కాపాడుతాడంటూ చెప్తోంది. ఇక లాభం లేద‌ని ఆమెకు స్థానిక సూపర్ వైజర్లు కూడా న‌చ్చ‌జెప్పారు. కానీ ఆమె విన‌లేదు. దీంతో స్వ‌యంగా మండల ఎమ్మార్వో వ‌చ్చి ఆమెకు త‌మ భాష‌లోనే గోండులో వివరించారు. కానీ ఆమె మాత్రం ఎవ‌రి మాట విన‌కుండా దేవుడినే నమ్ముకున్నానని చెప్తోంది. అయినా కూడా ఆఫీస‌ర్లు ఆమెను తీవ్ర ఒత్తిడి చేయ‌డంతో పక్కింటికి వెళ్లిపోయింది. అయితే చాలా మంది చెప్పిన తర్వాత పీహెచ్‌సీకి వెళ్లేందుకు అంగీకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news