విరాట్ కోహ్లీ తగ్గేదెలే.. మరో అరుదైన రికార్డు సొంతం

-

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటకే అతని ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. తన కెరీర్ ప్రారంభం నుంచి అలుపెరగని యోధుడిలా పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని చెబుతున్నాడు. టెస్టుల్లో సచిన్ రికార్డను బ్రేక్ చేయడం కోహ్లీ డ్రీమ్. కానీ అది ఇప్పట్లో పాజిబుల్ అయ్యేలా కనిపించడం లేదు.

అయినప్పటికీ తాజాగా మరో రికార్డు కోహ్లీ వశం అయ్యింది. టెస్టులు, వన్డేల్లో 1000కి పైగా చొప్పున ఫోర్లు బాదిన ఎనిమిదో క్రికెటర్‌గా టీమిండియా రన్ మెషిన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు కోహ్లీ టెస్టుల్లో 1,001, వన్డేల్లో 1,302 ఫోర్లు బాదాడు. గతంలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్న వారిలో ఉన్నారు. అటువంటి లెజెండ్స్ సరసన విరాట్ తాజాగా చోటు దక్కించుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news