తల కొరివి పెట్టే సమయానికి లేచి కూర్చున్న వృద్దురాలు

బారామతీలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 76 ఏళ్ల మహిళ చనిపోయిందని నమ్మి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా ఆమె అంత్యక్రియలకు ముందు లేచి కూర్చుంది. బారామతిలోని ముధాలే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఆమెకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వయసు పెద్దది కావడంతో ఆమె ఆరోగ్యం ఆందోళన కలిగించింది. ఆ తర్వాత మరణించడంతో దహన సంస్కారాలకు ఏర్పాటు చేసారు.

శకుంతల గైక్వాడ్ గా గుర్తించబడిన ఈ వృద్దురాలిని మే 10 న వృద్ధ మహిళను ప్రైవేట్ వాహనంలో బారామతికి తీసుకెళ్లారు. ఇక అక్కడకు వెళ్ళగా ఆమెకు బెడ్ దొరకలేదు. ఆ తర్వాత కారులోనే అపస్మారక స్థితిలో పడి కదలకుండా ఉండిపోయారు. ఆమె చనిపోయిందని కుటుంబం భావించింది. అంత్యక్రియల కోసం బంధువులకు చెప్పగా… ఆమె అంత్యక్రియల వరకు వచ్చిన తర్వాత లేచి కూర్చుంది. అకస్మాత్తుగా, ఆ మహిళ ఏడుపు ప్రారంభించింది మరియు తరువాత కళ్ళు తెరిచింది అని అధికారులు తెలిపారు.