బ్రేకింగ్ : హైదరాబాద్ లో కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్

-

హైదరాబాద్‌ లోని రాచకొండ లో కరుడు గట్టిన గజదొంగ అరెస్ట్ అయ్యాడు. ఈ కరుడగట్టిన గజదొంగను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు గజ దొంగ రాసికుల్ ఖాన్ పాల్పడుతున్నాడు. రాచకొండ లో ఏకంగా… 17 ఇండ్ల లో దొంగతనాలకు పాల్పడ్డాడు నిందితుడు.

అలాగే.. పలు రాష్ట్రాల్లో 100లకు పైగా గజ దొంగ రాసికుల్ ఖాన్ పై కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే … 3.5 కిలోల బంగారం పలు కేసులో కూడా ఈ గజ దొంగ రాసికుల్ ఖాన్ కీలక ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే… ఈ నిందితుడి కోసం 70,000 ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు పోలీసులు.

ఇక గజ దొంగ రాసికుల్ ఖాన్ ను అరెస్టు చేసి… ఏకంగా… 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాళం ఉన్న ఇండ్లను రెక్కీ చేసి దోచుకుంటున్న రాసికుల్ ఖాన్… కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇక తాజాగా ఈ గజ దొంగ రాసికుల్ ఖాన్ ను అరెస్టు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news