BREAKING : మహారాష్ట్రలోని 10 మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కరోనా

-

కరోనా మహమ్మారి… మళ్లీ ఇండియాలో కలిచివేస్తోంది. రోజురోజుకు ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలో ఏకంగా పది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా సోకిన ప్రజాప్రతినిధులంతా హోమ్ ఐ సొల్యూషన్ లో ఉన్నట్లు తెలిపారు. వారి పరిస్థితి ప్రస్తుతం చాలా నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాగే మన రాష్ట్ర ప్రజలంతా కరోనా నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ని అమలు చేస్తోంది ప్రభుత్వం. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 22,775 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,04,781 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.32 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news