యూపీలో గుర్రం పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్..!

-

లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ సందర్భంగా ఇవ్వాళ 8 రాష్ట్రాలు, యూటీలలోని 57 పార్లమెంట్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాములుగా అయితే బైక్ మీదనో, కారు మీదనో.. లేదా అవి లేని వారు నడుచుకుంటు వచ్చి ఓటు వేస్తారు. కానీ ఈ ఎన్నికల్లో కొందరు వ్యక్తులు ఓటు వేసేందుకు జంతువులనే వాహానాలుగా వినియోగించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదివరకే జరిగిన ఎన్నికల్లో ఓ వ్యక్తి ఒంటిపై వచ్చి ఓటు వేయగా.. మరో వ్యక్తి తన మొదటి ఓటు చిరకాలం గుర్తుండిపోయేలా గేదెపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం చూశాం.

ఈ నేపధ్యంలోనే యూపీలో ఓ వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏకంగా గుర్రంపై వచ్చాడు. తన పెంపుడు గుర్రాన్ని అందంగా అలంకరించి దానిపై స్వారీ చేసుకుంటూ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఇది చూసి క్యూలో ఉన్న ఓటర్లతో పాటు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదేమిటని అడగగా.. తను చాలా దూరం నుండి వస్తున్నానని, నేను ఎక్కడికి వెళ్లినా గుర్రంపైనే ప్రయాణం చేస్తానని బదులు ఇచ్చాడు. చివరికి ఆ వ్యక్తి తన గుర్రాన్ని పోలింగ్ బూత్ లోని ఓ చెట్టుకు కట్టేసి వెళ్లి లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news