మోడీ వైపే దేశ ప్రజలు.. ఫలితాలపై ఆందోళన అనవసరం : జేపీ నడ్డా

-

ఈ నెల 4వ తేదీన వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆందోళన అవసరం లేదని, దేశ ప్రజలంతా మోడీ వైపే ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. శనివారం ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నడ్డా మాట్లాడారు. బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నొక్కి చెప్పారు. బీజేపీ 370, ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. దేశానికి మోడీ అవసరమని ప్రజలు అర్థం చేసుకున్నారని, మాకు ఏమాత్రం భయం లేదని వెల్లడించారు. చింద్వారా సీటుతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అన్ని స్థానాలను గెలుస్తామని చెప్పారు. రాజస్థాన్ లోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు.

ప్రధాని మోడీ ధ్యానంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై నడ్డా స్పందిస్తూ..వారికి ఆధ్యాత్మిక విషయాలు పూర్తిగా తెలియవని.. వారు కేవలం రాజకీయ పర్యాటకులు మాత్రమేనని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలోనే మతపరమైన పర్యటనలు చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్నికలను వర్గీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. దక్షిణాదిలోనే బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ. తమిళనాడులో ఓట శాతం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజలు మోడీ నాయకత్వంలో నూతన మార్పులను చూడాలని అనుకుంటుందన్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news