రైల్వే ట్రాక్ పై కారు నడిపిన మహిళ.. అంతా మద్యం మహిమ..!

సాధారణంగా ఎవరైనా కార్ నడపాలంటే రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ ఉంటారు… కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచించింది రోడ్డుపై కాకుండా రైల్వే ట్రాక్పై నడిపింది. దీంతో ఇది చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా మద్యం మత్తులో రైల్వే ట్రాక్ పై కారు నడిపిన మహిళ మూడు కిలోమీటర్ల వరకు దూసుకుపోయింది. ఈ ఆసక్తికర ఘటన స్పెయిల్ లో చోటు చేసుకుంది.

స్పెయిన్ కి చెందిన 25 ఏళ్ల మహిళ ఫుల్లుగా మద్యం సేవించింది పరిమితి కంటే ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువగా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ రైల్వే ట్రాక్ పైకి కారు ఎక్కించి అలాగే గమనించకుండా దూసుకుపోయింది. మూడు కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత టైర్ పంచర్ కావడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది గమనించిన అధికారులు కారు తొలగించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళ పై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.