సైనికుడి కుటుంబానికి యాభై లక్షల చెక్కు..!

ఇటీవలె సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారత సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో దేశ రక్షణ కోసం ఎంతగానో పోరాటం చేసి చివరికి వీరమరణం పొందారు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పై అటు భారతదేశం మొత్తం ఘన నివాళులు అర్పించింది. ఇటీవలే దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అంతేకాకుండా యాభై లక్షల పరిహారం కూడా ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి అందజేశారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎంపీ రెడ్డప్ప సహా పలువురు ఎమ్మెల్యేలతో కలిసి 50 లక్షల చెక్కులు అందజేసిన ఆయన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.