కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. రాహుల్ గాంధీ నాయకత్వంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. మొన్న శనివారం ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఇక నిన్న ఈ యాత్రకు బ్రేక్ ఇచ్చిన రాహుల్ గాంధీ… ఇవాళ మళ్లీ ప్రారంభించారు.
అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు.. రాహుల్ గాంధీ భద్రతా వలయాన్ని దాటి.. రాహుల్ గాంధీ గారిని మురిపెంగా కౌగిలించుకుంది, ఆ తర్వాత అతన్ని ఆశీర్వదించింది. ఫ్యాసిస్టు పాలనలో అన్ని విధాలుగా నలిగిపోతున్న ఈ దేశ పేద మధ్య తరగతి ప్రజలను గట్టున చేర్చి, దేశాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళే ఒకే ఒక్క దేశ నాయకుడు రాహుల్ గాంధీ అంటూ ఆ వృద్ధురాలు పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఒక తల్లి భద్రతా వలయాన్ని దాటి తన బిడ్డలాంటి @RahulGandhi గారిని మురిపెంగా కౌగిలించుకుంది, ఆశీర్వదించింది!
ఫ్యాసిస్టు పాలనలో అన్ని విధాలుగా నలిగిపోతున్న ఈ దేశ పేద మధ్య తరగతి ప్రజలను గట్టున చేర్చి, దేశాన్ని మళ్ళీ అభివ్ర్రద్ధి పథంలోకి తీసుకెళ్ళే ఒకే ఒక్క దేశ నాయకుడు రాహుల్ గాంధీ! pic.twitter.com/KJhYKpITdF
— Telangana Congress (@INCTelangana) September 16, 2022