స్పోర్ట్‌ బైక్‌ కోసం..112 సంచుల్లో రూపాయి నాణాలతో వచ్చిన యువకుడు..!!

-

చిన్నప్పుడు డబ్బులు దాచుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అలా వేసిన డబ్బును ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చినప్పుడు తీస్తారు. ఇక్కడ ఓ కుర్రాడు కూడా బైక్‌ కొనేందుకు రూపాయి రూపాయి కూడబెట్టుకున్నాడు. అంటే ఏదో మాటవరసకు అనడం లేదండీ.. అతను నిజంగానే రూపాయి రూపాయి దాచి సంచుల్లో నింపాడు. ఆ డబ్బుతోనే బైక్‌ కొన్నాడు. ఈ చిల్లరతో బైక్‌ కొన్న వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్‌ తారకరామ కాలనీకి చెందిన వెంకటేష్ అనే యువకుడికి స్పోర్ట్స్ బైక్‌పై తిరగాలని ఆశ.. వెంకటేష్‌కే కాదు.. అబ్బాయిలందరికీ బైక్‌ అంటేనే ఒక ఎమోషన్‌. ఒక సర్టైన్‌ ఏజ్‌ వచ్చేసరికి బైక్‌ లేకపోతే చాలా గిల్టీగా ఫీల్‌ అవుతాు.. సొంత డబ్బులతో బైక్‌ కొన్న వాళ్లైతే..ఇక ఆ బైక్‌ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు.. వెంకటేష్‌కు కూడా బైక్‌ పై రయ్‌రయ్‌మని తిరగాలనుకున్నాడు…అయితే ఆ కోరిక తీర్చుకోవడానికి అవసరమయ్యే డబ్బులను ఒక్కసారిగా కాకుండా రూపాయి ..రూపాయి పోగుచేసి బైక్‌ కొనుక్కునేందుకు బైక్‌ షోరూంకు వెళ్లాడు. స్పోర్ట్స్ బైక్ అంటే కనీసం రెండు లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలిసిన వెంకటేష్ డబ్బులు లెక్క పెట్టకుండా మొత్తం చిల్లర నాణాల రూపంలో ప్లాస్టిక్ కవర్లలో నింపుకొని షోరూంకు వెళ్లాడు.
ఆవిధంగా 112సంచుల్లో వెంకటేష్‌ షోరూంకి తెచ్చిన కాయిన్స్‌ని చూసి షోరూం నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.. కస్టమర్‌ తెచ్చిన నాణాల కవర్లను ఓ టేబుల్‌పై ఉంచి ..షోరూంలోని సిబ్బందితో గురువారం మధ్యాహ్నం నుంచి లెక్కబెట్టించారు. చిల్లర డబ్బులు లెక్కించిన తర్వాతే బైక్ ఇస్తామని వెంకటేష్‌కి షోరూం నిర్వహకులు తెలిపారు. అందుకు అతను కూడా అంగీకరించడంతో ఒక రోజు పాటు 15మంది సిబ్బంది కాయిన్స్‌ని లెక్కించారు. మొత్తం 112బస్తాల్లో తెచ్చిన డబ్బులు 2.85లక్షల రూపాయలు ఉన్నట్లుగా గుర్తించారు. కాయిన్స్ లెక్కించడం పూర్తి కాగానే..బైక్‌ సరిపడ డబ్బులు ఉండటంతో.. వెంకటేష్‌ కోరుకున్న బైక్‌ని అందజేశారు.
అంత డబ్బును ఎంత ఓపిగ్గా దాచాడో కదా..! మనం కూడా మనకు దొరికిన చిల్లర అంతా ఎప్పుడూ ఒక దగ్గర దాస్తూ ఉంటే చాలా డబ్బులు అవుతాయోమో కదా..! మీకు కూడా ఈ అలవాటు ఉందా..?

Read more RELATED
Recommended to you

Latest news