శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గోడను ఢీ కొని యువకుడు మృతి

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీ కొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గల్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామాన్ని అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీ కొన్న నవీన్ అనే యువకుడు మృతి చెందాడు.

మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొంటాడు యువకుడు. నవీన్ మృతి చెందాడని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మలుపు వద్ద ఎలాంటి సూచిక బోర్డు మరియు లైట్లు ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదం జరిగిందని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పోచ్చెట్టిగుడా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.  ప్రస్తుతం నవీన్‌ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం… ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు పోలీసులు.