సెల్ఫీ పిచ్చి.. మహిళను కాపాడబోతే ప్రాణం పోయింది..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణం కాపాడబోయిన యువకుడు చివరికి తన ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. వివాహిత ను కాపాడే బోయిన యువకుడు సెల్ఫీ పిచ్చి కారణంగా చివరికి నీటిలో మునిగి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండిపోయింది. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వివాహిత హైదరాబాద్లోని చిలక చెరువు వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

అదే సమయంలో చెరువు గట్టున వినీష్ అభిషేక్ అనే ఇద్దరు యువకులు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు. అయితే సదరు మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇద్దరు యువకులు గమనించారు దీంతో వెంటనే అప్రమత్తమైన వినీష్ చెరువులో దూకి సదరు మహిళను కాపాడ పోయాడు. కానీ ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకోవాలని భావించి మద్యం మత్తులో సెల్ఫీ తీసుకున్న క్రమంలో సదరు మహిళ తో పాటు ప్రాణాలు కోల్పోయాడు యువకుడు.