వోట్లు అడగడానికి వెళుతున్న టీఆర్ఎస్ నేతలకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా ఓటర్లు రోడ్డెక్కారు. ఓట్ల కోసం వచ్చిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావుకు రోడ్లు వేయాలంటూ చుక్కలు చూపించారు యాప్రాల్ ప్రజలు. నో రోడ్స్ నో వోట్స్ ప్లకార్డులతో రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ అయిపోగానే సొంత నిధులతో రోడ్స్ వేస్తానని…లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి ప్రమాణం కూడా చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి.
అయితే మీ డబ్బుతో అవసరం లేదని తాము జీహెచ్ఎంసీకి ట్యాక్స్ కడుతున్నామని, ఆ డబ్బుతోనే రోడ్లు వేయాలని ఓటర్లు డిమాండ్ చేశారు. ఇక మరో పక్క సికింద్రాబాద్ బౌధనగర్ డివిజన్లలో తెరాస డిప్యూటీ స్పీకర్ పద్మ రావ్ కి ప్రజల నుండి ఎదురుదెబ్బ తగిలింది. బౌధనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి కంది శైలజ కోసం పాదయాత్రలో ప్రజలు ఎదురు తిరిగి భూతులు తిట్టినట్టు చెబుతున్నారు.