కామారెడ్డిలో కలకలం..యువకుడి న్యూడ్‌కాల్‌ చేసిన యువతి

-

కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. నగ్నంగా వీడియో కాల్ చేసి 60 వేల రూపాయలు వసూలు చేసింది ఓ గుర్తు తెలియని యువతి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన యువకుడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది ఓ గుర్తు తెలియని యువతి. వీడియో కాల్ రికార్డ్ చేశానని డబ్బులు పంపించకుంటే, యూట్యూబ్లో పెడతానని బెదిరించింది యువతి.

అనంతరం ఢిల్లీ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని, ఓ యువతి నీపై కేసు పెట్టిందని డబ్బులు పంపించాలని ఆ యువకుడ్ని బెదిరించాడు మరో వ్యక్తి. దీంతో భయాందోళనకు గురై, 60 వేల రూపాయలను విడతలవారీగా పంపించాడు కామారెడ్డికి చెందిన యువకుడు. అనంతరం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news