అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని.. ఇక పై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు అందించనున్నామని గ్రామీణా భివృద్ది, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ సిఎం వైఎస్ జగన్ మానస పుత్రికలు అని.. గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగులను కొంత మంది తప్పు దారి పట్టిస్తున్నారని.. ప్రోహిబిషన్ ఎగ్జామ్ లో ఎటువంటి రాజకీయాలు ఉండవని పేర్కొన్నారు. ఏపీపీఎస్సి ద్వారా డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఉద్యోగులకు ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. ఆగస్ట్ లో ఒకసారి, సెప్టెంబర్ లో ఒకసారి డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని.. ఇక పై నెలకు రెండు సార్లు మంత్రులగా మేము కూడా గ్రామ, వార్డ్ సచివాలయాలను సందర్శిస్తామని పేర్కొన్నారు. ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో ఇంటింటికి సచివాలయ సిబ్బంది తిరుగుతారన్నారు.