ఆధార్ కార్డు హిస్టరీని ఇలా తెలుసుకోచ్చు…!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. స్కీమ్స్ మొదలు ఎన్నో వాటికి ఆధార్ కార్డు తప్పని సరి. ఈ డాక్యుమెంట్ లేనిదే ఏ పని అవ్వదు. ఇది ఇలా ఉంటే ఆధార్ కార్డు అవసరం ఇంత పెరుగుతోన్న నేపథ్యంలో మీరు మీ యొక్క ఆధార్ ని ఎక్కడెక్క వాడుతున్నారు అనేది తెలుసుకోవాలి.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వాడారు అనేది తెలుసుకునేలా ప్రజలకు యూఐడీఏఐ అవకాశం కల్పిస్తోంది. ఈ మధ్య కాలం లో మోసాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి కనుక ఎప్పటికప్పుడు ఆధార్ హిస్టరీని చెక్ చేసుకుంటూ ఉండాలని యూఐడీఏఐ అంది. అయితే మరి ఎలా ఆధార్ హిస్టరీని చూడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

దీని కోసం ముందుగా మీరు ఆధార్ కార్డు అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లాలి.
ఇక్కడ మీరు My Aadhar option ను సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ మీరు ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ కింద, ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ వస్తుంది. దానిపై క్లిక్ చేసేయండి.
ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను నమోదు చెయ్యండి. సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు మీ ఆధార్ కార్డు హిస్టరీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news