బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా చూడండి..!

-

మీ బ్యాంక్ ఎకౌంట్ తో ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి. దీనితో మీకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలిసిపోతుంది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… ఈ విషయం మీరు తెలుసుకోవాలంటే కేవలం ఆధార్ నెంబర్ ‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే చాలు.

ఇప్పుడు ప్రతీ దానికి ఆధార్ అవసరం పడుతోంది. అది ఒక కీలకమైన డాక్యుమెంట్. అలానే బ్యాంక్ అకౌంట్ కి కూడా ఆధార్ కార్డు అవసరం. బ్యాంక్ అకౌంట్‌ తో ఆధార్ కార్డును తప్పక లింక్ చేసుకోవాలి అని అందరికీ తెలిసినదే. లింక్ చేసుకోకపోతే ఏదైనా సమస్య రావచ్చు. కాబట్టి లింక్ చేసుకోకపోయి ఉంటే చేసుకోండి.

ఇక లింక్ అయ్యిందో లేదో మీరు తెలుసుకోవాలంటే ఎన్‌పీసీఐ సర్వర్ నుంచి మీకు ఈ డేటా లభిస్తుంది. ఆధార్ నెంబర్‌ తో మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ అయితే చాలు బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ సులభం గానే తెలుసుకోవచ్చు.

ఇలా తెలుసుకోవాలంటే ముందు మీరు https://resident.uidai.gov.in/bank-mapper వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఇలా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version