మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వున్నవాళ్లు కచ్చితంగా వీటిని చూడండి. ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగానే కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ప్రభుత్వ పథకాలు, ఆదాయ పన్ను వంటి వాటికి ఆధార్ కచ్చితంగా కావాలి. అయితే ఆధార్ కార్డులు వున్నవాళ్లు ఈ రూల్స్ ని తెలుసుకోవడం అవసరం. ఆధార్ కార్డ్ వాడాలంటే అథెంటికేషన్ కావాలి. ఇటువంటి సందర్భాల్లో మన వివరాలు మోసగాళ్ల చేతి లో పడే అవకాశం ఉంది.
అందుకే యూఐడీఏఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక వాటి వివరాలని చూసేస్తే.. ఆధార్ అథెంటికేషన్ చేసే ముందు కచ్చితంగా ఆధార్ కార్డుదారుడి అనుమతి తీసుకోవాలి. రిక్వెస్టింగ్ ఎంటిటీస్ (ఆర్ఈ)లకు స్పష్టం చేసింది. ఆధార్ అథెంటికేషన్ చేయడానికి ముందు కార్డుదారుడి నుంచి పేపర్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో అనుమతి తప్పక తీసుకోవాలి.
మాములుగా అయితే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ ఆధార్ వివరాలను మాస్కింగ్ లేకుండా ఫిజికల్ గా కానీ ఎలక్ట్రానిక్ రూపంలో స్టోర్ చెయ్యవు. ఆధార్ వివరాలకి మాస్కింగ్ ఉంటుంది. తొలి 8 నెంబర్లు కనపడవు. కేవలం కార్డుదారుడి అనుమతి తీసుకున్న తర్వాతే నెంబర్ ని స్టోర్ చెయ్యాలి అని యూఐడీఏఐ అంది. అనుమతి తీసుకోవడం అలానే ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నారో లేదో కూడా తెలియజేయాల్సి వుంది. అంతే కాక అథెంటికేషన్ ట్రాన్సాక్షన్లు కొంత కాలమే చెల్లుబాటు అవుతాయి.