పాన్‌కార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానానికి ఇచ్చిన గడువు ఈనెల 30తో ముగియనుంది. ఆ తర్వాత ఆధార్ లేని పాన్‌కార్డులను ఆదాయపన్ను చట్టం కింద రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. గడవు ముగిసిన అనంతరం ఆధార్‌ను పాన్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలంటే కొత్త ఐటీఆర్ ఫైల్ చేసేవారు, అప్పుడు పేర్కొనే ఆధార్ సంఖ్యతో కొత్త పాన్ నెంబరు జారీ చేస్తామని తెలిపారు.
ఇప్పటి వరకూ జతపరచని వారు 30వ తేదీలోగా ఆదాయపన్ను శాఖకు సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని అధికారులు సూచించారు. లేకుంటే పాన్ కార్డు రద్దవుతుందని వారు తెలిపారు. గడువుకు ఇంకా మూడు రోజుల సమయం ఉండడంతో వెంటనే పాన్ నంబరుతో ఆధార్‌కార్డును జత చేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.