ఆగ‌స్టు 15 సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం క్విజ్ పోటీలు.. న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను గెలుచుకోవ‌చ్చు.

స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌, మైగ‌వ్ సంస్థ‌లు క‌లిసి సంయుక్తంగా క్విజ్ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ – స్వ‌తంత్ర భార‌త్ పేరిట జూలై 29 నుంచి ఆగ‌స్టు 10వ తేదీ వ‌ర‌కు ఈ క్విజ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భార‌తీయులు ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. యువ‌త‌లో దేశ‌భ‌క్తిని పెంపొందించ‌డం కోస‌మే ఈ క్విజ్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు.

aatma nirbhar bharat swatantra bharat quiz

క్విజ్ హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. 5 నిమిషాలు (300 సెక‌న్లు) కాల‌వ్య‌వ‌ధి. ఆ స‌మ‌యంలోగా 20 ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. విజేత‌ల‌కు ప్ర‌థ‌మ బ‌హుమ‌తి కింద రూ.25వేల న‌గ‌దు అందిస్తారు. అలాగే ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తుల కింద రూ.15వేలు, రూ.10వేల న‌గ‌దు అందిస్తారు. 7 మందికి రూ.5వేల చొప్పున ప్రోత్సాహ‌క న‌గదు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తారు.

నియ‌మ నిబంధ‌న‌లు…

* కేవ‌లం భార‌తీయులు మాత్ర‌మే ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనాలి. 14 ఏళ్లు నిండిన ఎవ‌రైనా స‌రే ఇందులో పాల్గొన‌వ‌చ్చు.
* 5 నిమిషాల్లో 20 ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చెప్పాలి క‌నుక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పిన వారిని విజేత‌లుగా ఎంపిక చేస్తారు.
* ఒక వ్య‌క్తి కేవ‌లం ఒక్క‌సారి మాత్ర‌మే క్విజ్‌లో పాల్గొనాలి.
* క్విజ్‌లో పాల్గొనాల‌నుకునే వారు త‌మ త‌మ పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ-మెయిల్‌, మొబైల్ నంబ‌ర్‌ల‌ను తెల‌పాల్సి ఉంటుంది.
* విజేత‌లను ఎంపిక చేశాక వారు త‌మ ఐడీ ప్రూఫ్‌, అడ్ర‌స్ ప్రూఫ్‌, బ్యాంక్ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి. లేదంటే న‌గ‌దు బ‌హుమ‌తిని ఇవ్వ‌రు.
* ఒక్క‌సారి వాడిన మొబైల్ నంబ‌ర్‌, ఈ-మెయిల్‌ను మ‌ళ్లీ ఉప‌యోగించ‌రాదు.
* క్విజ్‌లో ఒక‌టిక‌న్నా ఎక్కువ సార్లు పాల్గొన్నా.. చీటింగ్ చేసినా.. ఇత‌ర ఎలాంటి మోసానికి పాల్ప‌డ్డా.. స‌ద‌రు అభ్య‌ర్థుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టిస్తారు. వారిని క్విజ్ నుంచి తొల‌గిస్తారు.
* క్విజ్ ను నిర్వ‌హించే నిర్వాహ‌కులు, వారి కుటుంబ స‌భ్యులు ఇందులో పాల్గొనేందుకు అన‌ర్హులు.
* క్విజ్ పోటీల‌కు చివ‌రి తేదీ ముగిశాక అభ్య‌ర్థులు త‌మ స్కోర్ల‌ను చెక్ చేసుకోవ‌చ్చు.
* మై గ‌వ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి క్విజ్ పోటీలో పాల్గొన‌వ‌చ్చు.
* అభ్య‌ర్థులు క్విజ్ పోటీని స్టార్ట్ క్విజ్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా ప్రారంభించ‌వ‌చ్చు.
* పోటీ ప్రారంభ‌మ‌య్యాక అందులో ప్ర‌శ్న‌ల‌ను బ్యాంక్ నుంచి ర్యాండమ్‌గా పంపిస్తారు. వాటిని 5 నిమిషాల్లో ఆన్స‌ర్ చేయాలి. జ‌వాబు తెలియ‌క‌పోతే స్కిప్ చేసి తెలిసిన జ‌వాబులు చెప్ప‌వ‌చ్చు. చివ‌ర్లో తెలియ‌ని జ‌వాబులు చెప్ప‌వ‌చ్చు.
* విజేత‌లు ఎక్కువ మంది ఉంటే నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం వారిని ఎంపిక చేస్తారు.

క్విజ్‌లో పాల్గొన‌ద‌ల‌చిన వారు https://quiz.mygov.in/quiz/aatmanirbhar-bharat-swatantra-bharat-quiz/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.