దగ్గుబాటి అభిరామ్ హీరోగా ‘అహింస’..ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

-

ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు, హీరో రానా తమ్ముడు అభిరామ దగ్గుబాటి హీరోగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్న సంగత మనకు తెలిసిందే. దర్శకుడు తేజ దర్శకత్వంలో.. అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు తేజ పుట్టిన రోజు నేపథ్యంలో.. అభిరామ్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లో ఒక గోనె సంచిలో అభిరామ్‌ మొహాన్ని కట్టేసి.. బాగా రక్తం కారుతున్నట్లు గా చూపించారు. హింసతో కూడిన పోస్టర్‌ ను చూపిస్తూ.. అహింస అనే టైటిల్‌ ను పెట్టడం గమనార్హం. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై జెమిని కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో బాలీవుడ్‌ నుడు రజత్‌ బేడీ కీలక విలన్‌ పాత్రలో కనిపిస్తున్నారు. . అభిరామ్‌ కు జోడీగా గీతిక తివారీ నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ తేదీని అనౌన్స్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news