ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది…అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని..ప్రతిరోజూ నువ్వా-నేనా అన్నట్లే తలపడుతున్నాయి. అసలు ఇప్పుడే ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లు రాజకీయం నడుపుతున్నాయి. అంటే రాష్ట్రంలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు బాగా కసితో ఉన్నారు.
గత ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేశారు..అలాగే ఈ సారి గాని ఓడిపోతే వైసీపీని తట్టుకోవడం చాలా కష్టం…అలాగే టీడీపీ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడిపోతుంది…ఆ విషయం బాబుకు క్లియర్‌గా అర్ధమవుతుంది…అందుకే ఈ సారి ఎలాగైనా గెలవాలని చెప్పి టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు. తాజాగా కూడా అసెంబ్లీ ఇంచార్జ్‌లు, పార్లమెంట్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని, అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చారు.
అదే సమయంలో ప్రతిపక్షంలోకి వచ్చి మూడేళ్లు అయినా సరే బయటకు రాకుండా ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు…వారు ఏ మాత్రం బయటకొచ్చి పార్టీ కోసం పనిచేయడం లేదు. ఇక అలాంటి వారిని ఉపేక్షించేది లేదని బాబు తేల్చి చెప్పేశారు. అసలు నియోజకవర్గాల్లో తిరగకుండా, ఇప్పటికీ కదలని నాయకులను ఇక పార్టీ మోయలేదని చెప్పేశారు.
అసలు కొన్ని చోట్ల నాయకులు బయటకు రావడం లేదని, అలాంటి వారిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, వారికి అనేకసార్లు చెప్పిచూశామని, మార్పు వస్తుందని చాలా అవకాశాలు ఇచ్చామని, ఇంకా వేచి చూడడానికి పార్టీ సిద్ధంగా లేదని బాబు స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చేశారు. ఇక పనిచేయని వారిని భరించాల్సిన అవసరం పార్టీకి లేదని, అలాంటి వారిని పక్కన పెట్టడానికి ఏ మాత్రం ఆలోచించేది లేదన్నట్లు బబూ చెప్పారు. ఇక పార్టీలో పనిచేయకుండా ఉన్న నేతలని సైడ్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఇకనైనా వారు యాక్టివ్ అవుతారేమో చూడాలి.