డేరా బాబాకు జడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ.. కీలక నిర్ణయం తీసుకున్న హర్యానా ప్రభుత్వం

-

జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరాబాబా ఇటీవల మూడు వారాల పెరోల్ పై విడుదలయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యురిటీ ఏర్పాటు చేయాలని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్తానీ అనుకూల వర్గాల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

జైలుకు వెళ్లకముందు నుంచే ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి డేరా బాబాకు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు ముప్పు ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చిరించింది. దీంతో ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 7న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అంతకు ఒకరోజు ముందే జడ్ ప్లస్ భద్రతపై సీఐడీ అధికారులు పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు నిజం కావడంతో 20 ఏళ్లు శిక్ష విధించింది. 2017లో పంచకుల కోర్ట్ డేరాబాబాకు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 2019లో జర్నలిస్టు రామ్​చంద్ర ఛత్రపతి, 2021లో డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్యల కేసుల్లో ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news