విజయసాయిరెడ్డి వైసీపీలో అత్యంత కీలకమైన నాయకుడు అని అందరికీ తెలిసినదే. దాదాపు జగన్ తర్వాత స్థానంలో విజయసాయి రెడ్డి పేరు పార్టీలో ఎక్కువగా వినబడుతుంటది. ఒకానొక టైములో చార్టెడ్ అకౌంట్ గా మాత్రమే అయిన విజయ్ సాయి రెడ్డి వైఎస్ అధికారంలోకి వచ్చాక అంతకంతకూ పెరుగుతూ పోయారు. వైయస్ ఆస్తులకు సంబంధించి అన్ని లెక్కలను విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకునేవారు. దీంతో ఎంతో నమ్మకంగా పనిచేసే విజయసాయిరెడ్డిని ఆర్బిఐ డైరెక్టర్ చేయాలని వైఎస్ అప్పట్లో ప్రయత్నాలు చేయడం జరిగింది.అయితే వైఎస్ మరణించడంతో విజయ సాయి రెడ్డి ఆయన కుమారుడు జగన్ కి వెన్నెముక గా ఉంటూ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకుంటూ రాజకీయంగా ముందుండి నడిపించారు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ రిమోట్ మొత్తం విజయ్ సాయి రెడ్డి చేతిలో ఉంటది అని ప్రత్యర్ధులు అంటుంటారు. జగన్ అనేక పోరాటాలు పోరాడి, పాదయాత్ర చేసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాలను విజయ సాయి రెడ్డే దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానుల విషయంగాని ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన విషయాలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నవి. ఇలాంటి టైమ్ లో ఇటీవల కరోనా వైరస్ టెస్టింగ్ కీట్లు విషయంలో జగన్ సర్కార్ అవినీతి చేసిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసినదే.
కన్నా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టే సందర్భంలో దాదాపు బీజేపీతో వైరం పెట్టుకునే విధంగా విజయ సాయి రెడ్డి వ్యవహరించడం జరిగింది. బిజెపి నాయకుడు సుజనాచౌదరి… కన్నా లక్ష్మీనారాయణ నీ 20 కోట్లకు చంద్రబాబు కి అమ్ముడు పోయేలా చేశారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బిజెపి మరియు వైసీపీ పార్టీల మధ్య వైరాన్ని కొత్తగా కలిగించే విధంగా తయారయ్యాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఆర్కే కొత్త పలుకులో జగన్ కి వార్నింగ్ బెల్ ఇచ్చే విధంగా ఆర్టికల్ ప్రచురితం చేశారు.
పూర్తి మేటర్ లోకి వెళ్తే కన్నా వివాదం గురించి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్న సమయంలో గతంలో తాను సుజనా చౌదరి కంపెనీలకు ఆడిటర్‌గా పని చేశానని.. ఆయన దొంగ కంపెనీలు పెట్టి బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు. దాన్ని బట్టి తెలిసిందేమిటంటే.. ఆ స్కాం మొత్తం ఆడిటర్ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి దాన్ని బయటపెడతానని బెదిరించారు. ఈ వ్యాఖ్యలను తీసుకొని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ.. గతంలో సుజనా చౌదరి దగ్గర పనిచేసే ఇలా అంటున్న విజయసాయిరెడ్డి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని బెదిరించరని నమ్మకం ఏమిటని.. ఆర్కే కొత్త వార్నింగ్ బెల్ మోగించే విధంగా తన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో చెప్పుకొచ్చారు.