మన భారత దేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది..పెళ్ళి తర్వాత జరిగే శోభనం కు మరింత ప్రత్యేకత ఉంది.గదిలో చాలా మంది చాలా ఆచారాలు పాటిస్తారు. వీటి వెనుక ఎన్నో ఆచారాలు ఉన్నాయి. అసలు ఎందుకు పాలు తాగుతారు. కచ్చితంగా తాగాల్సిందేనా.. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి..వివాహం అనేది ఓ పవిత్రమైన బంధం. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అనేక ఆచారాలు కూడా ఉన్నాయి. ఆనందకరమైన వైవాహిక జీవితానికి మొదటి రాత్రి పునాది. సంప్రదాయాల ప్రకారం, ఓ గ్లాసు కుంకుమపువ్వు పాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడం వల్ల బంధానికి మధురానుభూతి చేకూరుతుందని నమ్ముతారు. సంప్రదాయం ప్రకారం ఓ గ్లాసు కుంకుమపువ్వు పాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడం వల్ల బంధానికి మధురానిభూతి చేకూరుతుందని అంటారు..
చాలా రోజులుగా కుంకుమపువ్వు కోరికలను రెచ్చగొట్టేందుకు వాడతారు. ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే పాలల్లో కుంకుమపువ్వు కలపడం వల్ల జీవశక్తి మెరుగుపడుతుంది. కొత్తగా పెళ్ళైన జంటకి ఈ పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శాస్త్రీయంగా, కుంకుమపువ్వు గొప్ప యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉందని చెబుతారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఆందోళనను తగ్గించడానికి క్రమం తప్పకుండా తింటే డిప్రెషన్ తగ్గిపోతుంది. అయితే మొదటి రాత్రి వీటిని తాగడం వెనుక లాజిక్ ఏంటంటే, రిలాక్స్‌డ్, హ్యాపీ రిలేషన్‌షిప్‌ని ప్రారంభిస్తారాని అంటారు..
కామసూత్రలో పాలు తాగడం ఉంది. ప్రేమ పుట్టడానికి ముందు వీటిని తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుందని చెబుతారు. అయితే అప్పట్లో గ్లాసు పాలలో సోంపు, తేనె, పంచదార, మిరియాలు, కుంకుమపువ్వు వంటివి కలిపేవారు. ఇవి ప్రముఖ హిందూ వివాహ సంప్రదాయానికి దారి తీశాయి. సంవత్సరాలుగా కలిపే పదార్థాలు మారుతున్నాయి కానీ, సంప్రదాయం అయితే కొనసాగుతుంది..ఇది అసలు కథ..మామూలు రోజుల్లో తాగిన కూడా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.