గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 36వ నేషనల్ గేమ్స్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ క్రీడలను దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్నారు. చివరి సారిగా 2015లో కేరళలో నిర్వహించారు. ఈ క్రీడల్లో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు భారత త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్ జట్ల నుంచి మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు.
అయితే.. కొన్నిరోజుల క్రితం అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణపతకం సాధించిన రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మరోసారి సత్తా చాటింది. 36వ జాతీయ క్రీడల్లో కూడా బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో 53 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన అంతిమ్.. మధ్యప్రదేశ్‌కు చెందిన రెజ్లర్ ప్రియాన్షీ ప్రజాపతిని ఓడించింది. జాతీయ క్రీడల్లో అంతిమ్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇలా తొలిసారే స్వర్ణపతకాన్ని తన ఖాతాలో వేసుకున్న అంతిమ్ చరిత్ర సృష్టించింది. ఆగస్టు నెలలో జరిగిన అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా అంతిమ్ స్వర్ణపతకం సాధించింది.