ఏసీ అతిగా వాడితే పేలిపోయే ఛాన్స్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి..!

-

వేసవికాలంలో ఎండలు మండిపోతూ ఉంటాయి ఇటువంటి సమయంలో రోజంతా మనం ఏసీ లోనే ఉంటాము. అలా రోజు అంతా ఏసి అలా రన్ అవుతూనే ఉంటుంది వేసవికాలంలో ఏసీ ని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వాలి లేకపోతే ఏసీ పాడైపోయే ప్రమాదం.. పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. 2022లో ఒక సంఘటన జరిగింది. ఎయిర్ కండిషనర్ పేలిపోవడంతో మంటలు వచ్చేసాయి. నలుగురు మరణించారు. ఏసీలో మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.

కాబట్టి ఏసి విషయంలో కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నిజానికి వేసవిలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కూలర్లు ఇన్వెటర్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఒత్తిడి వైర్లు మీద కలుగుతూ ఉంటుంది. దీంతో ఏసి పేలిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఏసీ ని సురక్షితంగా వాడొచ్చు. క్రమం తప్పకుండా ఏసీ ఫిల్టర్ లని క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏసీ పాడవదు. ఒకవేళ కనుక క్లీన్ చేయకపోతే ఏసి పేలే అవకాశం ఉంది.

ఏసిని కనెక్ట్ చేస్తున్న సాకేట్ అలానే న్యూట్రల్ కనెక్షన్ రెండు కూడా గట్టిగా ఉండాలి. వదులుగా ఉండటం వలన నిప్పు రవ్వలు రావచ్చు. ఈ విధంగా అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 1.5 టన్ ఏసీ కోసం ఎప్పుడు ఫోర్ ఎం ఎం మల్టీప్లక్స్ వైర్ ని కలిగి ఉండాలి ఏసీ కి విద్యుత్ సరఫరా చేసే వైర్ల మందం నాలుగు ఎంఎం కంటే తక్కువ ఉంటే ఆ వైర స్విచ్ బోర్డ్ లో మంటలని చెలరేగించొచ్చు కాబట్టి ఈ తప్పును కూడా లేకుండా చూసుకోవాలి. ఇలా ఫాలో అయితే ఏసీలని సేఫ్ గా వాడచ్చు. ప్రమాదం ఏమి ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news