కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ అంకుర్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి మొదట ఫుట్ పాత్ దూసుకోచ్చి ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టింది. AP 10 AW 5669 నెంబర్ గల హోండా సిటీ కారు డివైడర్ ను ఢీకొట్టి దానిని దాటుకుని చెట్టుని ఢీకొనడంతో నుజ్జు నుజ్జు అయింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
బిఎచ్ఈఎల్ బీరం గూడకి చెందిన మెడిసిన్ చదువుతున్న ప్రణీత్, ఫ్యాషన్ డిజైనర్ అయిన మరో అమ్మాయి ఇద్దరూ కలిసి మాదాపూర్ లోని ఒక పార్టీకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానంతో డ్రంకన్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు ఈ ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.