ఏపీలో ఒకే రోజు మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం !

-

ఏపీలో ఈ తెల్లవారుజామున మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం సంచలనంగా మారింది. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మరణించగా పదుల సంఖ్యలో జనం పరిస్థితి విషమంగా ఉంది. ముందుగా గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మరొక లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మినీ లారీ పంక్ఛర్‌ కావడంతో రోడ్డు పక్కన నిలిపి, పంక్ఛర్‌ వేస్తున్న సమయంలో అటుగా వచ్చిన 12 టైర్ల లారీ.. మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోపక్క కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట పై గురువారం తెల్లవారుజామున లారీ, మినీ లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు.

ఉల్లిపాయల లోడుతో మినీ లారీ తాడిపత్రి నుంచి చెన్నై మార్కెట్ కు వెళ్తుండగా, వెనుక వైపు నుంచి కారు లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మినీ లారీ లోని ఇద్దరు రైతులు లారీ క్యాబిన్ లో ఇరుక్కుని మృతి చెందారు. మరో పక్క నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన తుఫాను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాను కారులో ప్రయాణిస్తున్న 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెదగంజాం కు చెందిన ఓ కుటుంబం చెన్నైలో జరిగిన శ్రీమంతం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news